Mahatma Gandhi: గాంధీ చేతిలో కర్రకు బదులు చీపురు పెట్టండి: మోదీ

  • గతేడాది ఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రారంభం
  • తొలుత మోదీ విగ్రహం పెడతామన్న నిర్వాహకులు
  • చీపురు పట్టుకున్న గాంధీ విగ్రహాన్ని పెట్టాలని సూచన

 జాతిపిత మహాత్మాగాంధీ చేతిలో కర్రకు బదులుగా చీపురు పెట్టాలని మేడం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులకు  ప్రధాని మోదీ సూచించారు. చేతిలో చీపురుతో పరిసరాలను శుభ్రం చేస్తున్నట్టు గాంధీ మైనపు విగ్రహాన్ని తీర్చిదిద్దాలని కోరారు. అలా ఉంటే స్వచ్ఛభారత్‌కు ప్రేరణగా ఉంటుందని, దేశంలోని 125 కోట్ల మందిలో స్ఫూర్తిని రగిలిస్తుందని అన్నారు.

ప్రధాని చేసిన ఈ సూచనకు సంబంధించిన వీడియోను టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు షేర్ చేశారు. గతేడాది డిసెంబరులో ఢిల్లీలో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. అందులో తొలుత మోదీ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్వాహకులు భావించి ఆయనను కలిశారు. అయితే, తన విగ్రహానికి బదులుగా తొలుత గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అది కూడా చేతిలో చీపురు పట్టుకునేలా ఉండాలని ప్రధాని సూచించారు. కావాలంటే గాంధీ చీపురు పట్టుకున్నట్టున్న ఫొటోను తాను పంపిస్తానని వారితో చెప్పారట. నేడు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మ్యూజియం నిర్వాహకులు ఈ వీడియోను షేర్ చేశారు.

More Telugu News