President Of India: దేశ ప్రజలకు రాష్ట్రపతి స్వాతంత్య్ర దినోత్సవ సందేశం

  • నాగరిక సమాజంలో హింసకు తావులేదు
  • హింస కంటే అహింస మంత్రం చాలా గొప్పది
  • దేశాభివృద్ధిలో అందరూ భాగస్వాములవుతున్నారని ప్రశంస

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. మహాత్మాగాంధీ బోధించిన అహింస మంత్రం హింస కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైందని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదంటూ పరోక్షంగా మూకదాడులను ప్రస్తావించారు. దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునే దశలో వివాదాలకు తావుండకూడదన్నారు.

సమాజంలో మహిళలకు ప్రత్యేక స్థానం ఉందని, వారికి నచ్చిన మార్గాన్ని ఎన్నుకునే అవకాశం, స్వేచ్ఛ వారికి ఉండాలన్నారు. అన్ని రంగాల ప్రజలు వారి వారి రంగాల్లో విశేష కృషి చేస్తూ దేశాభివృద్ధిలో కీలక భాగస్వాములవుతున్నారని రాష్ట్రపతి ప్రశంసించారు. ఈ సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్ దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.

More Telugu News