jena sena: ‘జనసేన’ మేనిఫెస్టోలోనివి మచ్చుతునకలు కాదు.. కాపీ తునకలే!: మంత్రి యనమల

  • ఇందులోని అంశాలు చాలా వరకు అమల్లో ఉన్నవే
  • కొన్ని అంశాలను కేంద్రం చేయాల్సి ఉంది
  • 12 హామీలు, 7 సిద్ధాంతాలు పాతవే

ఏపీ జనసేన పార్టీ మేనిఫెస్టో విజన్ డాక్యుమెంట్ ను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు విడుదల చేసిన విషయం తెలిసిందే. మేనిఫెస్టోలోని కొన్ని మచ్చుతునకలంటూ 12 హామీలు, 7 సిద్ధాంతాలను పొందుపర్చారు. దీనిపై ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు గుప్పించారు. ఈ విజన్ డాక్యుమెంట్ లో ఉన్నవి మచ్చుతునకలు కాదని కాపీ తునకలని విమర్శించారు. ఈ పన్నెండు అంశాలు చాలా వరకు అమల్లోనే ఉన్నాయని, ఇందులో కొన్నింటిని మాత్రం కేంద్ర ప్రభుత్వం చేయాల్సి ఉందని చెప్పారు. రేషన్ కు బదులుగా నగదు బదిలీ, అగ్రవర్ణాల కోసం కార్పొరేషన్ వంటి అంశాలు, ‘జనసేన’ పేర్కొన్న 7 సిద్ధాంతాలు కూడా పాతవేనని కొత్తవేమీ కాదని అన్నారు. 

More Telugu News