Rahul Gandhi: ఓహ్, నేను మర్చిపోయాను, ఇది ‘స్కామ్ గ్రెస్’ పార్టీ!: రాహుల్ కు కేటీఆర్ కౌంటర్

  • రాహుల్ అవినీతి గురించి మాట్లాడుతున్నారా?
  • ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్ వెల్త్
  • నన్ను ఇంకా కొనసాగించమంటారా సార్?: కేటీఆర్

తెలంగాణలో రెండు రోజులు పర్యటించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్ పై, సీఎం కేసీఆర్ పై విమర్శలు, ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వంలో అవినీతికి అంతంలేదని ఆరోపించడంపై మంత్రి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు.

‘మీరు అవినీతి గురించి మాట్లాడుతున్నారా రాహుల్ జీ? వేదికపై మీ చుట్టూ ఉన్న వాళ్లను చూడండి; మీ పక్కన కూర్చున్న వాళ్లలో సగం మంది బెయిల్ పై బయటకు వచ్చిన వాళ్లే!! కొంతమంది సీబీఐ కేసుల్లో, ఇంకొంతమంది అవినీతి కేసుల్లో ఉన్నారు. ఓహ్, నేను మర్చేపోయాను.. ఇది ‘స్కామ్ గ్రెస్’ పార్టీ. ఏ ఫర్ ఆదర్శ్, బీ ఫర్ బోఫోర్స్, సీ ఫర్ కామన్ వెల్త్... నన్ను ఇంకా కొనసాగించమంటారా సార్??’ అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా తూర్పారబట్టారు.

More Telugu News