NTR: అచ్చం తండ్రిలా బాలయ్య... ‘యన్.టి.ఆర్’ ఫస్ట్ లుక్ విడుదల!

  • కాషాయ రంగుల దుస్తులలో బాలకృష్ణ
  • మైక్ ముందు ప్రసంగిస్తున్న బాలయ్య పోజ్
  • అచ్చు ఎన్టీఆర్ లా కనిపిస్తున్న బాలకృష్ణ

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్ ‘యన్.టి.ఆర్’. రేపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేసింది. కాషాయ రంగుల దుస్తులు ధరించి, మైక్ ముందు ప్రసంగిస్తున్న పోజ్ లో బాలకృష్ణ అచ్చం తన తండ్రి ఎన్టీఆర్ లా కనిపించడం గమనార్హం.

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ బయోపిక్ ను యన్.బి.కె. ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్నారు. కాగా, ఈ బయోపిక్ లో మోక్షజ్ఞ ఎన్టీఆర్ చిన్ననాటి పాత్రలో, నారా భువనేశ్వరిగా మంజిమా మోహన్, సావిత్రిగా కీర్తి సురేశ్, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, చంద్రబాబు నాయుడిగా రానా, రామానాయుడుగా వెంకటేశ్, కృష్ణగా మహేశ్ బాబు నటిస్తున్నారు. 

More Telugu News