vijay devarakonda: ప్రేమ విషయంలో గోవిందం కూడా 'అర్జున్ రెడ్డి ' టైపే: విజయ్ దేవరకొండ

  • బన్నీవాసు నన్ను ఒప్పించాడు 
  • పరశురామ్ నా పాత్రను బాగా మలిచాడు 
  • యూత్ కి ఈ సినిమా బాగా నచ్చుతుంది

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన 'గీత గోవిందం' .. రేపు అంటే 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "ఈ సినిమాలో నేను ఓ కాలేజ్ లో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కనిపిస్తాను. ఈ సినిమాలో నేను నా పాత్రను బాగా చేయడానికీ .. సినిమా బాగా రావడానికి కారకులు దర్శకుడు పరశురామ్.

ఇక ఈ తరహా సినిమాను నాతో చేయించిన ఘనత బన్నీవాసుగారిదే. ఆయనే పట్టుబట్టి నాతో ఈ సినిమా చేయించారు. నా పాత్ర అయిన గోవిందానికి .. అర్జున్ రెడ్డికి మధ్య ఎక్కడైనా పోలిక ఉంటుందా? అని అంతా అడుగుతున్నారు. ప్రేమ కోసం 'అర్జున్ రెడ్డి' ఎంత దూరమైనా వెళతాడు .. 'గోవిందం' కూడా ఆ టైపే. ప్రేమ విషయంలో .. ప్రేమను సాధించుకునే విషయంలో ఈ రెండు పాత్రల మధ్య పోలిక కనిపిస్తుంది. నా నుంచి వచ్చే సినిమా ఎలా వుండాలని యూత్ కోరుకుంటుందో .. 'గీత గోవిందం' అలాగే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం నాకు వుంది" అని చెప్పుకొచ్చాడు.     

More Telugu News