NTR BIOPIC: 'ఎన్టీఆర్' బయోపిక్.. చంద్రబాబు భార్య పాత్రలో మంజిమ?

  • ధ్రువీకరించని చిత్ర యూనిట్
  • శరవేగంగా సాగుతున్న రెండో షెడ్యూల్ షూటింగ్
  • సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు

తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా నందమూరి బాలకృష్ణ , బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యా బాలన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో రానా దగ్గుబాటి కన్ఫామ్ అయ్యారు. అయితే చంద్రబాబు భార్య, ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి పాత్రను ఎవరు చేస్తారన్నవిషయమై చిత్ర యూనిట్ ఇప్పటివరకూ నోరు మెదపలేదు.

అయితే తాజాగా ఈ విషయమై ఓ ఆసక్తికరమైన వార్త సినీవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ మలయాళ నటి మంజిమా మోహన్ ను భువనేశ్వరి పాత్రకు క్రిష్ ఎంపిక చేశాడని సమాచారం. మంజిమ ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలో నాగచైతన్యకు జోడీగా నటించింది. ఈ సినిమాలో చంద్రబాబు దంపతులతో పాటు ఏఎన్నార్, శ్రీదేవి, సావిత్రి, ఎస్వీఆర్ తదితర పాత్రలు కూడా కనిపించనున్నాయి. ప్రస్తుతం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

More Telugu News