sensex: మళ్లీ లాభాల బాట పట్టిన మార్కెట్లు

  • మార్కెట్లపై ప్రభావం చూపని రూపాయి పతనం
  • 207 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 11,435 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ

నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు ఈ రోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. టర్కీలో ఆర్థిక మాంద్యం వల్ల మన రూపాయి విలువ ఈ రోజు కూడా పతనమైనప్పటికీ... దాని ప్రభావం మార్కెట్లపై పడలేదు. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 207 పాయింట్లు పెరిగి 37,852కు ఎగబాకింది. నిఫ్టీ 79 పాయింట్లు పుంజుకుని 11,435కు చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
హెచ్డీఐఎల్ (11.59%), బాల్ క్రిష్ణ ఇండస్ట్రీస్ (8.75%), ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటెయిల్ (7.95%), వా టెక్ వాబాగ్ లిమిటెడ్ (7.27%), టీఐ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ (7.07%).
 
టాప్ లూజర్స్:
వక్రాంగీ (-16.25%), అలహాబాద్ బ్యాంక్ (-6.32%), రెడింగ్టన్ ఇండియా లిమిటెడ్ (-5.89%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-5.00%), చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ (-4.40%).  

More Telugu News