narayana rao: గాయాలైనా చిరంజీవి లెక్కచేసేవాడు కాదు: నటుడు నారాయణరావు

  • చిరంజీవితో 'దేవాంతకుడు' చేశాను 
  • మోకాలి నొప్పితో బాధపడ్డాడు 
  • అయినా షూటింగుకి వచ్చేశాడు

చిరంజీవి, నారాయణరావు ఇద్దరూ మంచి స్నేహితులు. చిరంజీవితో పాటు నారాయణరావు కొన్ని చిత్రాలలో నటించడమే కాదు, చిరంజీవి హీరోగా కొన్ని సినిమాలను నిర్మించారు కూడా. అలాంటి సినిమాలలో 'దేవాంతకుడు' ఒకటి. 1984 లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా విశేషాలను గురించి నారాయణరావు ప్రస్తావించారు.

"చిరంజీవి అంకితభావం గురించి ముందే చెప్పాను .. తన వలన షూటింగ్ ఆలస్యం కావడానికి ఆయన అసలు ఇష్టపడడు. సీన్ అనుకున్న విధంగా రావడానికి ఎంత కష్టమైనా పడతాడు .. ఆ ప్రయత్నంలో గాయాలైనా లెక్కచేయడు. నేను నిర్మాతగా 'దేవాంతకుడు' సినిమా చేస్తుండగా, చిరంజీవికి మోకాలు దగ్గర ఇబ్బంది తలెత్తింది. దాంతో డాక్టర్ల సలహా మేరకు ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు.

అప్పుడు ఈ సినిమాలో 'చెల్లెమ్మకి పెళ్లంటా .. అన్నయ్యకి సంబరమంటా' అనే సాంగ్ ను షూట్ చేయవలసి వచ్చింది. అయినా సరే .. ఇప్పుడు వద్దులే తరువాత చూసుకుందామని చిరంజీవితో చెప్పాను. 'లేదు .. లేదు .. చేసేద్దాం ..' అంటూ షూటింగుకి వచ్చేశాడు. చెప్పాను గదా హార్డ్ వర్కర్ అని .. వద్దని ఎవరు ఆపినా ఆయన ఆగడు" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News