High Court: లైంగిక వేధింపుల కేసులో నల్గొండ జిల్లాలో న్యాయమూర్తి అరెస్ట్!

  • తుంగతుర్తి సెషన్స్ కోర్టు న్యాయమూర్తిగా సత్యనారాయణ
  • లైంగిక వేధింపుల ఆరోపణలపై చిక్కడపల్లి పోలీసుల విచారణ
  • హైకోర్టు అనుమతితో ఈ ఉదయం అరెస్ట్

నల్గొండ జిల్లా తుంగతుర్తి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ జరిపిన హైదరాబాద్, చిక్కడపల్లి పోలీసులు, ఆరోపణలపై ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని తేల్చారు. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలిపి, సత్యనారాయణ అరెస్ట్ కు అనుమతి తీసుకున్నారు. ఈ ఉదయం జడ్జి సత్యనారాయణను అరెస్ట్ చేసినట్టు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. 

More Telugu News