shivashankar: చిన్నప్పుడే నా వెన్నెముక విరిగిపోయింది: డాన్స్ మాస్టర్ శివశంకర్

  • పడుకునే చదువుకునేవాడిని 
  • 5వ క్లాస్ లో స్కూల్లో చేరాను 
  • ఆటలు ఆడనిచ్చేవారు కాదు    

ఎన్నో వందల సినిమాలకి  శివశంకర్ మాస్టర్ నృత్య దర్శకత్వం వహించారు. ఆట విడుపుగా అప్పుడప్పుడు నటుడిగాను మెరిశారు. అలాంటి శివశంకర్ మాస్టర్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు. తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు.

"మాది చాలా పెద్ద కుటుంబం .. మా ఇల్లు కూడా చాలా పెద్దది. ఇంటిముందు పొడవైన అరుగులు ఉండేవి. నాకు ఒకటిన్నర .. రెండేళ్లు వున్నప్పుడు మా పెద్దమ్మ నన్ను ఒళ్లో పడుకోబెట్టుకుని అరుగుపై కూర్చుంది. అంతలో ఒక ఆవు అటుగా పరిగెత్తుకు రావడంతో, ఆమె భయపడిపోయి ఇంట్లోకి పరిగెత్తబోయింది. ఆ సమయంలో నేను జారిపోయి గడపపై పడిపోయాను .. దాంతో నా వెన్నెముక విరిగిపోయింది.

అప్పట్లో ఫారిన్ నుంచి తిరిగొచ్చిన ఒక సీనియర్ డాక్టర్ నాకు ట్రీట్మెంట్ చేశారు. చాలాకాలం పాటు నేను కదలకుండా పడుకునేవాడిని. ఇంట్లో పడుకునే చదువుకుంటూ .. 5వ క్లాస్ లో స్కూల్లో చేరాను. ఆ స్కూల్ కూడా మా ఇంటికి చాలా దగ్గరగా వుండేది. ఆట పాటలకు నన్ను దూరంగా ఉంచేవారు .. అలా ఎలాంటి ఆటలు ఆడకుండానే నా బాల్యం గడిచింది" అని చెప్పుకొచ్చారు.

More Telugu News