aravinda swami: ఆసక్తిని రేపుతోన్న 'నవాబ్' ఫస్టులుక్

  • తమిళంలో 'చక్క చివంత వానం'
  • తెలుగులో 'నవాబ్' గా 
  • సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో .. మణిరత్నం దర్శకత్వంలో 'చక్క చివంత వానం' అనే తమిళ సినిమా రూపొందుతోంది. తెలుగులో ఈ సినిమాకి 'నవాబ్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి అరవింద్ స్వామి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. 'వరద' అనే పాత్ర పేరుతో అరవిందస్వామిని పరిచయం చేస్తూ వదిలిన ఈ ఫస్టులుక్ ఆసక్తిని రేకెత్తించే విధంగా వుంది.

రఫ్ లుక్ తో యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన ఎక్స్ ప్రెషన్ తో ఈ పోస్టర్ లో అరవిందస్వామి కనిపిస్తున్నాడు. ఆయనతో పాటు శింబు .. అరుణ్ విజయ్ .. విజయ్ సేతుపతి .. జ్యోతిక .. అదితీ రావు .. ఐశ్వర్య రాజేశ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. విలక్షణమైన పాత్రలతో .. అనూహ్యమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. మణిరత్నం సినిమాలను ఇష్టపడే అభిమానులంతా ఈ సినిమా కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.    

More Telugu News