nagarjuna: 'మన్మథుడు 2' టైటిల్ ను రిజిస్టర్ చేయించిన నాగ్

  • 'దేవదాస్' షూటింగులో నాగ్
  • తరువాత మూవీగా 'బంగార్రాజు'
  • చైతూ .. అఖిల్ కోసమంటూ టాక్

నాగార్జున కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాలలో ఒకటిగా 'మన్మథుడు' కనిపిస్తుంది. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో అన్నపూర్ణ బ్యానర్లో 2002లో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడల్లా ఈ సినిమా మంచి రేటింగ్ ను సాధిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగార్జున .. అన్నపూర్ణ బ్యానర్లో 'మన్మథుడు 2' సినిమాను రిజిస్టర్ చేయించారు.

దాంతో 'మన్మథుడు' సినిమాకి సీక్వెల్ గా .. నాగ్ హీరోగా ఈ సినిమా వస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ప్రస్తుతం నాగార్జున 'దేవదాస్' సినిమా చేస్తున్నారు. ఆ తరువాత ఆయన 'బంగార్రాజు' సినిమా చేయనున్నారు. అందువలన 'మన్మథుడు 2' సినిమా ఆయన చేయకపోవచ్చనీ, చైతూ కోసం గానీ .. అఖిల్ కోసం గాని ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించి ఉండొచ్చని చెప్పుకుంటున్నారు. త్వరలోనే ఈ విషయంలో స్పష్టత రానుంది.   

More Telugu News