varuntej: ఈనెల 15న కొత్త సినిమా టైటిల్ ని ప్రకటించనున్న మెగా హీరో!

  • సంకల్ప్ రెడ్డి‌ దర్శకత్వంలో వరుణ్ తేజ్ కొత్త సినిమా
  • ఈనెల 15న ఉదయం 9.30 గంటలకు టైటిల్‌, విడుదల తేదీ ప్రకటన
  • అంతరిక్షం నేపథ్యంలో సినిమా

సంకల్ప్ రెడ్డి‌ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ అంతరిక్షం నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఉదయం 9.30 గంటలకు సినిమా టైటిల్‌తో పాటు విడుదల తేదీని ప్రకటించనున్నట్లు తన ట్వీట్ లో పేర్కొన్నాడు. లావణ్య త్రిపాఠి, ఆదితిరావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతాన్ని అందిస్తున్నాడు.

More Telugu News