Japan: ఓ పట్టణానికి లక్ష్మీదేవి పేరు పెట్టిన జపాన్ ప్రభుత్వం!

  • వివరాలు వెల్లడించిన జపాన్ కాన్సులర్
  • ప్రసంగాన్ని కన్నడలో ప్రారంభించిన కిటగవ
  • వందల ఏళ్లుగా హిందూ దేవుళ్లను ఆరాధిస్తున్నామని వెల్లడి

జపాన్ ఎంత ఆధునిక దేశమైనా అక్కడి ప్రజలు మత సంప్రదాయాలను పాటిస్తారు. కుటుంబ సభ్యులతో కలసి మందిరాలను సందర్శిస్తారు. తాజాగా జపాన్ లోని ఓ పట్టణానికి అక్కడి ప్రభుత్వం లక్ష్మీదేవి పేరును పెట్టింది. ఈ విషయాన్ని జపాన్ కాన్సుల్ జనరల్ టకయుకి కిటగవ వెల్లడించారు. బెంగళూరులో ఆదివారం ఓ కాలేజ్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా కిటగవ తన ఉపన్యాసాన్ని కన్నడలో ప్రారంభించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.


రాజధాని టోక్యోకు సమీపంలో ఉన్న ఓ పట్టణానికి తాము ‘కిచియోజి’ అని పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు. జపనీస్ భాషలో కిచియోజి అంటే  లక్ష్మీ దేవి అని అర్థమని వెల్లడించారు. జపాన్ లో వందలాది ఏళ్లుగా హిందూ దేవుళ్లను పూజిస్తున్నారని పేర్కొన్నారు. జపనీస్ లో 500 వరకూ సంస్కృత పదాలు ఉన్నాయన్నారు.

భారత సంస్కృతి మాత్రమే కాకుండా భాషలు కూడా జపాన్ పై గణనీయమైన ప్రభావం చూపాయని కిటగవ వ్యాఖ్యానించారు. జపాన్ లో విదేశీ నిపుణులకు మంచి డిమాండ్ ఉందని కిటగవ చెప్పారు.


More Telugu News