YSRCP: గుంటూరులో వైసీపీ నేతల హౌస్ అరెస్ట్!

  • నిజనిర్ధారణ కమిటీ పర్యటన నేపథ్యంలో నిర్ణయం
  • ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డ కాసు మహేశ్ రెడ్డి
  • అక్రమ మైనింగ్ బయటపడుతుందనే అడ్డుకున్నారని విమర్శ

గుంటూరు జిల్లాలోని పిడుగురాళ్ల, దాచేపల్లిలో అక్రమ మైనింగ్ ను పరిశీలించేందుకు ఈ రోజు ఉదయం బయలుదేరిన వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం వైసీపీ నేతలు కాసు మహేష్ రెడ్డి, ఎమ్మెల్యే డా.గోపి తదితరుల్ని హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలిస్తామని వైసీసీ నిజనిర్ధారణ కమిటీ ప్రకటించింది.

తమను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంపై కాసు మహేశ్ రెడ్డి మండిపడ్డారు. యరపతినేని అధ్వర్యంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యవహారాలు బయటకు వస్తాయనే తమను పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు.

నరసరావు పేట ఎమ్మెల్యే డా.గోపి రెడ్డి మాట్లాడుతూ.. యరపతినేని అవినీతిలో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కు వాటా ఉందని అన్నారు. గత నాలుగేళ్లుగా గుంటూరులో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా సాగుతోందని విమర్శించారు. టీడీపీ నేతలు చివరికి రైతులపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని గోపి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News