స్కూలు యూనిఫామ్ లో కమెడియన్లు!: ఫొటోలు విడుదల చేసిన వెన్నెల కిశోర్

13-08-2018 Mon 10:20
  • థీమ్ పార్టీకి హాజరైన నటులు
  • చిన్నషార్ట్ వచ్చిందన్న వెన్నెల కిశోర్
  • వైరల్ గా మారిన ఫొటోలు
కమెడియన్ వెన్నెల కిశోర్ సినిమాల్లోనే కాదు.. బయట కూడా పంచ్ లు వేస్తూ అందరిని నవ్విస్తుంటాడు. తాజాగా టాలీవుడ్ కమెడియన్లు అందరూ స్కూలు యూనిఫామ్ లో ఉన్న ఫొటోను కిశోర్ ట్వీట్ చేశాడు. మన కమెడియన్లు స్కూలుకు వెళ్లడం ఏంటి? వాళ్లందరూ చిన్నప్పుడు ఓకే స్కూలు లో చదువుకున్నారా? అని ఆశ్చర్యపోకండి. వీరంతా స్కూలు యూనిఫామ్ లో థీమ్ పార్టీకి హాజరయ్యారు.


‘బ్యాక్ టు స్కూల్’ పేరుతో పార్టీ చేసుకున్న కమెడియన్లు.. పొట్టి నిక్కర్లు, హాఫ్ షర్టులు, టై ధరించి ఫన్నీగా ఉన్న సన్నివేశానికి సంబంధించిన ఫొటోను కిశోర్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. కమెడియన్లు సప్తగిరి, ధన్ రాజ్, రోలర్ రఘు, చిత్రం శీను, వేణు వండర్ తదితరులు ఈ ఫొటోలో ఉన్నారు. ఈ పార్టీలో వేసుకోవడానికి తనకు చిన్న షార్ట్ వచ్చిందని కిశోర్ చెప్పాడు. కాగా, ఈయన పోస్ట్ చేసిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.