Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మంచి పాత్రల గురించి సమంత
  • 'చిత్రలహరి'లో ఇద్దరు హీరోయిన్లు 
  • 'కేడీ నెం 1'గా వస్తున్న షకలక శంకర్ 
  • యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో కాజల్

*  'నేను కోరుకునే పాత్ర ఇంకా రాలేదు..' అంటోంది కథానాయిక సమంత. 'ఎప్పటికప్పుడు ఇది మంచి పాత్ర అనుకుంటూ చేస్తూ వుంటాను. తీరా అది చేసేశాక దానిని మించిన పాత్ర చేయాలనిపిస్తుంది. ఈ విషయంలో నాకు కోరికలు పెరుగుతూ వుంటాయి తప్పితే, తృప్తి మాత్రం కనపడడం లేదు' అని చెప్పింది సమంత. కాగా, ఈ ముద్దుగుమ్మ నటించిన 'యూ టర్న్' సినిమా త్వరలో విడుదల కానుంది.
*  మెగా హీరో సాయిధరం తేజ్ హీరోగా కిషోర్ తుమ్మల దర్శకత్వంలో రూపొందే 'చిత్రలహరి' చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. వీరిలో ఒకరిగా ఇప్పటికే నివేదా థామస్ ను ఎంపిక చేయగా, మరో హీరోయిన్ కోసం ప్రస్తుతం పలు పేర్లను పరిశీలిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుంది.
*  ఇటీవల 'శంభో శంకర' చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన 'జబర్దస్త్' ఫేం షకలక శంకర్ ప్రస్తుతం మరో రెండు చిత్రాలలో హీరోగా నటిస్తున్నాడు. వీటిలో ఒకటి 'డ్రైవర్ రాముడు' కాగా, మరొక చిత్రం పేరు 'కేడీ నెం 1'. ఈ చిత్రానికి జానీ దర్శకత్వం వహిస్తున్నాడు.  
*  'సాక్ష్యం' చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ మరో చిత్రాన్ని మొదలెట్టాడు. నూతన దర్శకుడు శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో కాజల్ కూడా పాల్గొంటోంది. 

More Telugu News