adilabad: ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల జలమయం!

  • ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వర్షాలు
  • పలు ప్రాంతాల్లో కూలిపోయిన ఇళ్లు
  • అసిఫాబాద్ లోని గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు

ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, ప్రాజెక్టులతో పాటు, ప్రాణహిత, పెనుగంగ నదుల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, వేలాది ప్రాంతాల్లో పంట నీటమునిగింది. అసిఫాబాద్ లోని 8 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగువ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాజెక్టులకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. గుండివాగు, తుంపల్లి వాగు పొంగిపొర్లుతున్నాయి. భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కొమురం భీం ప్రాజెక్టులోని ఐదు గేట్లు ఎత్తివేశారు. సాత్నాల్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండే దశకు చేరుకున్నట్టు సమాచారం. 

More Telugu News