Rajamouli: ఎన్టీఆర్, రామ్ చరణ్ చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్!

  • రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమా
  • మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించాలని చూస్తున్న రాజమౌళి
  • అధికారిక ప్రకటన వెలువడకున్నా సినీ వర్గాల్లో చర్చ

ఈ సంవత్సరం టాలీవుడ్ లో ప్రకటితమైన అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమా రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించనున్న చిత్రమేననడంలో సందేహం లేదు. ఇప్పటికే వరుస విజయాలతో ఉన్న ఈ ముగ్గురూ కలసి చేస్తున్న చిత్రంపై ఫ్యాన్స్ లో ఎన్నో అంచనాలు ఉండగా, వీరిద్దరికీ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తోడవనున్నాడని ఇండస్ట్రీలో కొత్త వార్త వినిపిస్తోంది.

ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉన్నాయన్న విషయమై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, సోషల్ మీడియా మాత్రం, ఈ సినిమాలో మహేష్ బాబును భాగం చేయాలని రాజమౌళి భావిస్తున్నారని అంటోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులను చూసుకుంటున్న రాజమౌళి, సినిమాకు మహేష్ బాబుతో వాయిస్ ఓవర్ చెప్పించాలని చూస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి మహేష్ ఒప్పుకుంటే, ఈ స్టార్ హీరోల ఫ్యాన్సంతా కలసి థియేటర్ల దగ్గర ఎలా సందడి చేస్తారో చెప్పక్కర్లేదు.

More Telugu News