indonesia: ద్వీపాన్నే పైకి లేపిన భూకంపం.. ఇండోనేసియాలో మరో వింత!

  • 25 సెంటీమీటర్లు పైకెగసిన లంబోక్ ద్వీపం
  • కొన్ని చోట్ల ఆరంగుళాలు కుంగిన నేల
  • నిరాశ్రయులైన 3.5 లక్షల మంది

ఇండోనేసియాను ఇటీవల భారీ భూకంపం వణికించిన సంగతి తెలిసిందే. దీని దెబ్బకు 387 మంది చనిపోగా, భారీగా ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా భూకంపం ప్రభావంతో లంబోక్ ద్వీపంలో భౌగోళిక మార్పులు సంభవించినట్లు నాసా, కాలిఫోర్నియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప తాకిడితో లంబోక్ ద్వీపం వాయవ్య ప్రాంతం 25 సెంటీమీటర్లు పైకి లేచిందని వెల్లడించారు.

మరికొన్ని చోట్ల భూకంప తీవ్రతకు భూమి 2 నుంచి 6 అంగుళాల కిందకు కుంగిపోయిందని పేర్కొన్నారు. భూకంప కేంద్రానికి సమీపంలో ద్వీపం ఎత్తు 25 సెంటీమీటర్లు పెరిగిందని తెలిపారు. ఇండోనేసియాలో భూకంపంతో 68,000 ఇళ్లు ధ్వంసం కాగా, 3.5 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికారులు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. 

More Telugu News