IMD: తెలుగు రాష్ట్రాలను తరుముకొస్తున్న మరో అల్పపీడనం!

  • వాయుగుండంగా మారనున్న అల్పపీడనం
  • మరో మూడు రోజుల పాటు ప్రభావం
  • తీరం వెంబడి మరింత బలమైన గాలులకు అవకాశం

ఇప్పటికే భారీ వర్షాలతో ఇబ్బంది పడుతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు మరికొన్ని రోజుల పాటు వర్షంలో తడుస్తూ ఉండాల్సిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడనం వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని, దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ ఈ ఉదయం వెల్లడించింది. తీరం వెంబడి మరింత బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు. మరో మూడు రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుందని, అల్పపీడనం గమనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని, వాయుగుండంగా మారిన తరువాత ఏ ప్రాంతంలో తీరం దాటుతుందన్న విషయాన్ని అంచనా వేయవచ్చని వెల్లడించారు.

More Telugu News