Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • డాక్టర్ పాత్రలో కనిపించనున్న కాజల్
  • రవితేజ సినిమా విడుదల తేదీ ఖరారు 
  • హన్సిక 50వ చిత్రంగా 'మహా'!

*  శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ ఓ చిత్రంలో నటించనుంది. 'స్వామి రారా' ఫేం సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో కాజల్ డాక్టర్ పాత్రలో కనిపిస్తుంది. ఇందులో శర్వానంద్ ద్విపాత్రాభినయం చేయనున్నాడు. మరో హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శిన్ నటిస్తుంది.
*  శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న 'అమర్ అక్బర్ ఆంటోనీ' చిత్రం షూటింగ్ ప్రస్తుతం అమెరికాలో జరుగుతోంది. కాగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న విడుదల చేయడానికి నిర్మాతలు తాజాగా డేట్ ను నిర్ణయించారు. ఇందులో ఇలియానా కథానాయికగా నటిస్తోంది.
*  కథానాయిక హన్సిక నటించే తాజా చిత్రం పేరు 'మహా'. విశేషం ఏమిటంటే, ఇది ఆమె నటిస్తున్న 50వ చిత్రం. జమీల్ దర్శకత్వంలో తమిళ, తెలుగు బాషలలో రూపొందే ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. వచ్చే నెల నుంచి దీని షూటింగ్ జరుగుతుంది.

More Telugu News