doctor shilpa: మా అక్క ఆత్మహత్యకు ప్రొఫెసర్లే కారణం: డాక్టర్ శిల్ప చెల్లెలు శృతి

  • మా కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవు
  • గవర్నర్ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు
  • సిట్ తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు    

తన అక్కయ్య డాక్టర్ శిల్ప ఆత్మహత్యకు కారణం ప్రొఫెసర్లేనని ఆమె చెల్లెలు శృతి ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ప్రొఫెసర్ల వేధింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని అన్నారు. సిట్ దర్యాప్తుతో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని చెప్పింది.

శిల్ప భర్త రూపేష్ మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా జరగాలని కోరారు. ఇప్పటివరకు, తమనే అధికారులు విచారించారని, బాధ్యులైన ప్రొఫెసర్లను ఇంతవరకూ విచారించలేదని అన్నారు. శిల్ప మృతికి సంతాపం కూడా తెలపని ప్రభుత్వ డాక్టర్లు,  అనుమానాలు వ్యక్తం చేయడం దుర్మార్గమని అన్నారు. డాక్టర్ల అనుమానాలు నివృత్తి చేసేందుకు తాము సిద్ధమని, శిల్ప ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకుని ఉంటే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండేది కాదని అన్నారు.

కాగా, శిల్ప చెల్లెలు శృతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, ఈ కేసును సీఐడీకి అప్పగించడంతో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైందని సీఐ తేజోమూర్తి చెప్పారు. శిల్ప భర్త రూపేష్ స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్టు సీఐడీ డీఎస్పీ రమణ చెప్పారు.

More Telugu News