jyothika: తమిళంలో హిట్ కొట్టేసింది .. తెలుగులో 'ఝాన్సీ'గా వచ్చేస్తోంది

  • తమిళంలో 'నాచ్చియార్'
  • తెలుగులో 'ఝాన్సీ'
  • ఈ నెల 17న విడుదల  

తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా జ్యోతికకి ఎంతో క్రేజ్ వుంది. సూర్యతో వివాహం తరువాత సినిమాలను దూరం పెట్టిన ఆమె, ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చింది. తన వయసుకి తగిన ప్రధానమైన పాత్రలను చేస్తూ, విజయాలను అందుకుంటోంది. ఈ ఏడాది ఆరంభంలో తమిళంలో ఆమె చేసిన 'నాచ్చియార్' అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉండటంతో, ప్రేక్షకుల మనసులను పట్టేసింది. విమర్శకుల నుంచి కూడా ఈ సినిమా ప్రశంసలను కొట్టేసింది. దర్శకుడిగా 'బాలా'కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాంటి ఈ సినిమాను తెలుగులో 'ఝాన్సీ' పేరుతో అనువదించారు. ఈ నెల 17వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, ఇక్కడ ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.     

More Telugu News