ntr: రైల్వే స్టేషన్లో షూటింగ్ చేస్తున్న అరవింద .. వీరరాఘవ!

  • హైదరాబాద్ లో ఎన్టీఆర్ మూవీ షూటింగ్ 
  • ఈ నెల 15వ తేదీన టీజర్ రిలీజ్ 
  • అక్టోబర్ 11వ తేదీన సినిమా విడుదల

ఎన్టీఆర్ .. పూజా హెగ్డే నాయకా నాయికలుగా 'అరవింద సమేత వీరరాఘవ' సినిమా రూపొందుతోంది. తివిక్రమ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, కొన్ని రోజులుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల ఒక ప్రాచీన దేవాలయంలో ఎన్టీఆర్ .. పూజా హెగ్డేల కాంబినేషన్లో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఇక్కడి రైల్వే స్టేషన్ లో జరుగుతోంది. ఎన్టీఆర్ .. పూజా హెగ్డే తదితరులపై ఒక కీలకమైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. తెరపై ఈ సీన్ ఉత్కంఠను రేకెత్తిస్తుందని అంటున్నారు. ఈ నెల 15వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. ఎన్టీఆర్ ఫస్టులుక్ ను రిలీజ్ చేసినప్పుడు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫస్టు టీజర్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగేలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈషా రెబ్బా మరో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, జగపతిబాబు .. రావు రమేశ్ .. నాగబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 11న విడుదల చేయనున్నారు.        

More Telugu News