ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటా.. సెల్ టవర్ ఎక్కిన ఉద్యోగి

11-08-2018 Sat 12:24
  • హోదా కోసం తీవ్రతరమవుతున్న నిరసనలు
  • ధర్మవరంలో సెల్ టవర్ ఎక్కిన మున్సిపల్ ఉద్యోగి
  • నచ్చజెబుతున్న పోలీసులు, అధికారులు

ప్రత్యేక హోదా కోసం ఏపీలో నిరసనలు తీవ్రతరమవుతున్నాయి. ఇటీవలే ప్రత్యేకహోదాను డిమాండ్ చేస్తూ చిత్తూరులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు అనంతపురం జిల్లా ధర్మవరంలో పెనుబోలు విజయభాస్కర్ అనే ఓ మున్సిపల్ ఉద్యోగి సెల్ టవర్ ఎక్కాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, లేకపోతే టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని నినాదాలు చేస్తున్నాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు, అధికారులు అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.