triple talaq: రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఈసారీ జరగని చర్చ!

  • పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు
  • ఈ బిల్లును సభలో ప్రవేశపెట్ట లేదు
  • రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటన 

ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనూ ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రవేశపెట్టేందుకు కుదర్లేదు. ముస్లిం మహిళల కోసం తీసుకొచ్చిన ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఈరోజు చర్చ జరగాల్సి ఉంది. కానీ, పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టడం లేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నందున ఈ బిల్లును వచ్చే సమావేశాలకు వాయిదా వేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఇక పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు రానుంది. కాగా, ట్రిపుల్ తలాక్ ను నేరంగా పరిగణించేలా తీసుకొచ్చిన ఈ బిల్లు 2017 డిసెంబరు 28న లోక్ సభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడంతో ఈ బిల్లు ఆమోదం పొందలేకపోయింది.

More Telugu News