raana: 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా పట్ల ఆసక్తితో వున్న రానా

  • తెరపైకి మరో విభిన్న ప్రేమకథ 
  • ఆగస్టు 15వ తేదీన ట్రైలర్ రిలీజ్
  • సెప్టెంబర్ 7న సినిమా విడుదల   

కొత్తగా .. వైవిధ్యభరితంగా కనిపించే చిన్న సినిమాలను సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే వుంటారు. అలా వెంకట్ మహా దర్శకత్వంలో 'కేరాఫ్ కంచరపాలెం' సినిమా సురేశ్ ప్రొడక్షన్స్ లో రూపొందింది. ఈ సినిమా పట్ల గల నమ్మకంతో .. కంటెంట్ పట్ల గల ఆసక్తితో 'రానా'నే దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. 'కంచరపాలెం' ప్రాంతానికి చెందిన నలుగురు వ్యక్తుల జీవిత కథలు ఒకటిగా అల్లుకుని సాగడం ఈ సినిమాలో కనిపిస్తుంది.

వయసు ఎంత అంటే .. ఒక సంఖ్య మాత్రమే .. ప్రేమకి దానితో పనిలేదు అనే కంటెంట్ తో ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 15వ తేదీన ట్రైలర్ ను, సెప్టెంబర్ 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నామని తాజాగా రానా ట్వీట్ చేశాడు. సమర్పకుడిగా ఈ సినిమా తనకి మంచి పేరు తెచ్చిపెడుతుందని రానా భావిస్తున్నాడు. సహజత్వానికి చాలా దగ్గరగా అనిపించే ఈ సినిమా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడం ఖాయమనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశాడు.  

More Telugu News