Shirdi Sai: "ఓం ఇహైదే..." అంటూ చేతులు చాస్తే, పూలగుత్తిని విడిచిన షిర్డీ సాయి... వైరల్ అవుతున్న వీడియో!

  • సాయి మహిమ అంటూ వీడియో వైరల్
  • చేతుల్లో పడిన పూల గుత్తి
  • సామాజిక మాధ్యమాల్లో వైరల్

ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ, సాయి బాబా మహిమ అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ గుడిలో సాయి విగ్రహాన్ని అలంకరించి, ఆయన ఒళ్లో పెట్టిన ఓ పూల గుత్తి, అర్చకుడు చేతులు చాచగానే ఆయన చేతిలో పడుతున్న దృశ్యం ఇందులో ఉంది. సాయిని పూజిస్తూ మంత్రోచ్చారణ చేస్తున్న అర్చకులు "ఓం ఇహైదే..." అంటూ రెండు చేతులనూ సాయి ముందు చాచగా, అందులో పూల గుత్తి పడింది.

 ఆ వెంటనే భక్తులు చప్పట్లతో హర్షధ్వానాలు చేశారు. ఇది సాయి మహిమేనని నమ్ముతున్న ఎంతో మంది దీన్ని వాట్స్ యాప్, ఫేస్ బుక్ మాధ్యమాల్లో షేర్ చేసుకుంటున్నారు. ఈ వీడియోను ఏ గుడిలో తీశారన్న విషయమై స్పష్టత లేదు. ఆ వీడియోను మీరూ చూడండి. 

More Telugu News