ghantasala: ఘంటసాలగారు అలా అనడంతో మళ్లీ ఎప్పుడూ ఆయన ముందు 'నోరు' తెరవలేదు!: సావిత్రమ్మ

  • నేను మంగళహారతి పాడుతున్నాను 
  • అప్పుడే ఘంటసాల గారు వచ్చారు 
  • ఆయన వచ్చింది నేను చూడలేదు

తెలుగు పాటకి తేనె రుచి తీసుకొచ్చిన గాయకులు ఘంటసాల. గాయకుడిగానే కాదు .. సంగీత దర్శకుడిగాను ఆయన సక్సెస్ అయ్యారు. అలాంటి ఘంటసాల అర్థాంగిగా ఆయనతో కలిసి సావిత్రమ్మ సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. తాజా ఇంటర్వ్యూలో సరదాగా ఆమె ఒక విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

"ఒకసారి మద్రాసులో 'శ్రావణ మంగళవారం' నోము నోచుకున్నాను. 'పూజ అయిపోయింది కదా మంగళహారతి పాడవే' అని మా అమ్మమ్మ అంది. సరే అని చెప్పేసి నేను మంగళహారతి పాడుతున్నాను. ఘంటసాల గారు వచ్చి గుమ్మం బయటే నుంచున్నారు .. అది నేను చూడలేదు. ఆయనని మా అమ్మమ్మ చూసి 'ఏరా వాకిట్లోనే నుంచున్నావు .. హారతి తీసుకుందువు గాని లోపలికి రా' అంది. 'వద్దమ్మా .. నేను తనని కొడుతున్నానేమోనని చుట్టుపక్కలవాళ్లు అనుకుంటారు .. అందువలన బయటే నుంచున్నాను' అన్నారు. 'అంటే నా పాట ఏడుస్తున్నట్టుగా ఉందన్న మాట' అనే విషయం నాకు అర్థమైంది .. అంతే, ఇక ఇంకెప్పుడూ ఆయన ముందు నోరు తెరవలేదు" అంటూ నవ్వేశారు.     

More Telugu News