Rajya Sabha: 'ఏక్ బీకే... కోయీ నహీ బికే'... మోదీ సెటైర్!

  • రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో హరివంశ్ గెలుపు
  • ఇరు పక్షాల్లో ఓ 'హరి' ఉన్నాడన్న ప్రధాని
  • ఎవరూ అమ్ముడు పోలేదని వ్యాఖ్య

ఈ ఉదయం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో యూపీఏ అభ్యర్థి బీకే హరిప్రసాద్ ను ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ ఓడించిన తరువాత, ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ పై సెటైర్లు వేశారు. "ఈసారి ఎన్నికల్లో సభలోని రెండు పక్షాలూ చెరో 'హరి'ని కలిగివున్నాయి. అయితే, ఒకరి పేరులో 'బీకే' ఉంది 'కోయీ నహీ బికే' (ఎవ్వరూ అమ్ముడు పోలేదు)" అని ఆయన వ్యాఖ్యానించారు.

అంతకుముందు మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలుపును విపక్షాలు అంగీకరించక పోవడంతో చైర్మన్ వెంకయ్యనాయుడు ఓటింగ్ నిర్వహించడంతో హరివంశ్ కు 125, హరి ప్రసాద్ కు 105 ఓట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై సభలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, సభ తరఫున తాను ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ కు హరివంశ్ సన్నిహితుడని గుర్తు చేసుకున్నారు. విపక్ష నేత గులాంనబీ ఆజాద్ తో పాటు అన్ని పార్టీల నాయకులూ హరివంశ్ కు అభినందనలు తెలిపారు.

More Telugu News