Crime News: ఢిల్లీలో రైలు ఢీకొని 20 ఆవులు మృతి!

  • నరేలా ప్రాంతంలో ఘటన
  • ఆవుల మంద పట్టాలను దాటుతుండగా ఢీకొన్న శతాబ్ది
  • ఆ సమయంలో గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తున్న రైలు

వేగంగా వెళుతున్న కల్కా - శతాబ్ది ఎక్స్ ప్రెస్ న్యూఢిల్లీ శివార్లలోని నరేలా ప్రాంతంలో వెళుతున్న సమయంలో, ఓ ఆవుల మంద పట్టాలపైకి రావడంతో ఘోర ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని కనీసం 20 ఆవులు మృత్యువాత పడ్డాయి. హోలంబీ కలాన్, నరేలా మధ్య ఆవులు రైలు పట్టాలు దాటుతున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఇది చాలా భయానక ఘటన అని, రైలు పట్టాలు సైతం స్వల్పంగా దెబ్బతిన్నాయని నార్త్ రన్ రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

ప్రమాదం జరిగిన గంట తరువాత ఆ రైలు అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిందని, ఈ ప్రమాదంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని ఓ అధికారి తెలిపారు. ఆవుల మందను చూసిన రైలు డ్రైవర్ సడన్ బ్రేక్ వేసినప్పటికీ, ఫలితం లేకపోయిందని, రైలు గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తుండటమే ఇందుకు కారణమని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైనట్టు ఆయన వెల్లడించారు.

More Telugu News