ghantasala: ఘంటసాలగారు చనిపోయాక పలకరించినవారులేరు: ఆయన సతీమణి సావిత్రమ్మ

  • ఘంటసాల బాగున్నప్పుడు అంతా వచ్చారు 
  • ఆయన చనిపోయాక సాయపడినవాళ్లు లేరు 
  • ఇల్లు అమ్మేసుకుని వెళ్లిపొమ్మన్నారు

గంధర్వ గాయకులు ఘంటసాల గాన మాధుర్యాన్ని ఆయన పాడిన ప్రతిపాట అందిస్తూనే ఉంటుంది .. మనసును ఊయలలు ఊపుతూనే ఉంటుంది. ఘంటసాల మంచి స్వరం వున్న వారు మాత్రమే కాదు .. అంతకి మించిన మంచి మనసున్నవారు. తన సంపాదనలో ఆయన విరివిగా దానధర్మాలు చేస్తుండేవారు. ఎవరు ఎలాంటి అవసరంతో గుమ్మంలోకి వచ్చినా లేదనకుండా ఆయన సాయపడేవారట. అలాంటి ఘంటసాల మరణించిన తరువాత తమని పలకరించినవారు లేరని ఆయన సతీమణి సావిత్రమ్మ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

"ఘంటసాల గారు చనిపోయిన తరువాత ఎవరూ వచ్చి ఎలా వున్నారు అని అడగలేదు. మీ ఆర్ధిక పరిస్థితి ఏమిటి .. జరుగుబాటు ఎలా వుంది అని అడగలేదు. ఏమైనా సాయం కావాలంటే అడగండి అని ఎవరూ అనలేదు. సినిమా వాళ్లు అసలే అనలేదు .. మా బంధువులు అంతకంటే అడగలేదు. ఆయన బాగున్నప్పుడు అంతా వచ్చి భోజనం చేసి వెళ్లిన వాళ్లే .. చెరువు ఎండిపోయిన తరువాత ఏమవుతుందో అదే అయింది. ఇల్లు అమ్ముకుని సొంతవూరుకి వెళ్లిపొమ్మని కొంతమంది సలహాలు చెప్పారు. నా పిల్లలను చదివించుకుంటూ నేను ఇక్కడే వుంటాను అని వుండిపోయాను" అని చెప్పుకొచ్చారు.     

More Telugu News