Mahesh Babu: ఒకే థియేటర్ లో నాలుగు సిల్వర్ జూబ్లీల రికార్డు మహేష్ బాబుదే!

  • నేడు మహేష్ బాబు పుట్టిన రోజు
  • ఆయన రికార్డులు గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్
  • సుదర్శన్ 35 ఎంఎంలో 175 రోజులాడిన నాలుగు చిత్రాలు

1975, ఆగస్టు 9న జన్మించి, చిన్న వయసులోనే బాల నటుడిగా, ఆపై టాలీవుడ్ ప్రిన్స్ గా కోట్లాది మంది తెలుగు సినీ ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో మహేష్ బాబు నెలకొల్పిన రికార్డుల్లో కొన్నింటిని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. ఒకే థియేటర్ లో నాలుగు చిత్రాలు సిల్వర్ జూబ్లీలను జరుపుకున్న రికార్డు మహేష్ దేనని అంటున్నారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో మహేష్ నటించిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి చిత్రాలు 175 రోజులు ప్రదర్శితమయ్యాయి. ఇప్పుడున్న హీరోల్లో ఎవరికీ ఈ ఘనత లేదు. ఇదే సమయంలో 200 సెంటర్లలో 100 రోజులు ప్రదర్శించబడిన తొలి చిత్రం మహేష్ నటించిన 'పోకిరి' కావడం గమనార్హం. 'పోరాటం' చిత్రంతో బాలనటుడిగా పరిచయమై, ఆపై ముగ్గురు కొడుకులు, శంఖారావం, గూఢచారి 116, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు తదితర చిత్రాల్లో నటించిన మహేష్, 'రాజకుమారుడు' చిత్రంతో హీరోగా పరిచయమై ఇప్పటివరకూ 24 చిత్రాల్లో నటించాడు.

More Telugu News