vijay devarakonda: స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ!

  • కాకినాడ నేపథ్యంలో కొనసాగే కథ 
  • గోదావరి యాసలో మాట్లాడే హీరో 
  • క్రికెటర్ గా రష్మిక మందన  

'గీత గోవిందం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి విజయ్ దేవరకొండ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా షూటింగ్ మొదలైపోయింది. విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీగా 'డియర్ కామ్రేడ్' సినిమా రూపొందుతోంది. భరత్ కమ్మా దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కాకినాడ నేపథ్యంలో కొనసాగుతుంది.

కాకినాడలోని ఒక కాలేజ్ స్టూడెంట్ గా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. స్టూడెంట్ లీడర్ గా విజయ్ దేవరకొండ చేస్తుండగా .. క్రికెటర్ గా రష్మిక మందన కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే జరగనుంది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోని 'తొండంగి'లో షూటింగు జరుగుతోంది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇప్పటివరకూ తెలంగాణ యాసతో యూత్ ను ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ, ఈ సినిమాలో ఈస్ట్ గోదావరి యాసలో మాట్లాడనుండటం విశేషం.  

More Telugu News