Rajya Sabha: కాంగ్రెస్ కు షాకిచ్చిన కేజ్రీవాల్... రాజ్యసభ ఎన్నికల బాయ్ కాట్!

  • ఓటింగ్ లో పాల్గొనబోమన్న ఆమ్ ఆద్మీ పార్టీ
  • కాంగ్రెస్ తమ మద్దతును కోరుకోవడం లేదన్న సంజయ్ సింగ్
  • ఎన్డీయే అభ్యర్థి హరివంశ్ గెలుపు ఖాయమేనంటున్న నిపుణులు

నేడు జరుగుతున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ కు షాకిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతివ్వరాదని, ఎన్నికలను బాయ్ కాట్ చేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. తాము పెట్టిన షరతులను కాంగ్రెస్ పార్టీ పాటించని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని రాజ్యసభలో ఆప్ సభ్యుడు సంజయ్ సింగ్ వెల్లడించారు.

జేడీయూ తరఫున నిలిచిన హరివంశ్ నారాయణ సింగ్ కు మద్దతివ్వాలని నితీశ్ కుమార్ తమకు ఫోన్ చేసి కోరారని, అయితే, ఆ పార్టీ బీజేపీతో కలిసున్నందున ఆ పని చేయలేమని తాము స్పష్టం చేసినట్టు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా తమ మద్దతును కోరుకోవడం లేదని, అందువల్ల తమ పార్టీ తరఫున ఉన్న ముగ్గురు సభ్యులూ ఓటింగ్ లో పాల్గొనబోవడం లేదని అన్నారు. కాగా, రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక మరికాసేపట్లో ప్రారంభం కానుంది. విపక్షాలన్నీ ఐక్యంగా లేకపోవడంతో హరివంశ్ గెలుపు నల్లేరుపై నడకే.

More Telugu News