Maharashtra: మాకే అబద్ధాలు చెబుతారా?.. వాతావరణ శాఖ డైరెక్టర్ పై కేసు పెట్టిన రైతులు!

  • మహారాష్ట్రలో రైతన్నల ఆగ్రహం
  • తప్పుడు అంచనాలపై పోలీసులకు ఫిర్యాదు
  • స్పందించని వాతావరణ శాఖ

కొన్నిసార్లు వానలు పడక, ఇంకొన్ని సార్లు నకిలీ విత్తనాలు.. వెరసి రైతన్నలు నష్టపోతున్నారు. వీరిలో కొందరు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే, మరికొందరు ఇల్లు, పొలం అమ్ముకుని వలస పోతున్నారు. కానీ మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో ఉంటున్న రైతులు మాత్రం డిఫరెంట్. వాతావరణ శాఖ వర్షపాతంపై సరైన అంచనాలు ఇవ్వకపోవడంతో ఏకంగా సంస్థ డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సారి రుతుపననాల సందర్భంగా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరఠ్వాడా ప్రాంతానికి చెందిన రైతులు తమవద్ద ఉన్న మొత్తం నగదుతో పంటల్ని సాగుచేశారు. అయితే తొలికరి వర్షం మినహా వాన జాడలేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతన్నలు.. భారత వాతావరణ శాఖ(ఐఎండీ) పుణె డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి అధికారులు ఎరువులు, పురుగు మందుల కంపెనీలతో కుమ్మక్కై తప్పుడు అంచనాలను ఇచ్చారని ఆరోపించారు.

ఈ మేరకు రైతు సంఘం స్వాభిమాని షేట్కారీ సంఘటన మరఠ్వాడా ప్రాంత చీఫ్ మాణిక్ కదమ్ రైతులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు వాతావరణ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు.

More Telugu News