sushma swaraj: బాలీ వెళ్తున్నారా.. అగ్నిపర్వతాన్ని అడిగి చెబుతా!: నెటిజన్ కు సుష్మా ఫన్నీ రిప్లై

  • ట్విట్టర్ లో కోరిన సుశీల్ రాయ్
  • ఫన్నీగా జవాబిచ్చిన సుష్మ
  • ఇండోనేషియాను వణికిస్తున్న భూకంపాలు

భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ లో చురుగ్గా ఉంటారు. భారతీయులకు ఎక్కడ, ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుష్మ ఫన్నీగా జవాబిచ్చారు.

సుశీల్ రాయ్ అనే వ్యక్తి బుధవారం రాత్రి ట్విట్టర్ లో ‘ఇప్పుడు ఇండోనేషియాలోని బాలీకి వెళ్లడం సురక్షితమే అంటారా? మేం ఆగస్టు 11 నుంచి 18 వరకూ అక్కడ పర్యటించాలి. బాలీ పర్యటనకు ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు జారీచేసిందా? దయచేసి మాకు సాయం చేయండి’ అని సుష్మకు ట్వీట్ చేశాడు.

గత కొన్ని రోజులుగా ఇండోనేషియాలోని బాలీలో ఉన్న అగుంగ్ అగ్నిపర్వతం క్రీయాశీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. దీని కారణంగా బాలీ ద్వీపానికి రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం నుంచి లావా, బూడిద వెలువడటం తగ్గినప్పటికీ, ఇక్కడ స్వల్పంగా భూకంపాలు సంభవిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సుశీల్ ప్రశ్నకు సుష్మ స్పందిస్తూ..‘బాలీ సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే నేను ముందుగా అక్కడి అగ్ని పర్వతాన్ని సంప్రదించాలి’ అని ఫన్నీగా జవాబిచ్చారు.

More Telugu News