Arun Jaitley: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం రంగంలోకి దిగుతున్న అరుణ్ జైట్లీ.. మూడు నెలల విశ్రాంతి తర్వాత తొలిసారి బయటకు!

  • ఎన్డీయే అభ్యర్థి గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ
  • సభలో ఎన్డీయేను లీడ్ చేయనున్న జైట్లీ
  • తమ మద్దతు ఎన్డీయేకేనన్న నవీన్ పట్నాయక్

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం నేడు ఎన్నిక నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సభలో ఎన్డీయేను ముందుండి నడిపించనున్నారు. కిడ్నీ మార్పిడి కారణంగా జైట్లీ మూడు నెలలుగా అధికారిక విధులకు దూరంగా ఉన్నారు. వైద్యుల సలహా మేరకు ఆయన మూడు నెలలపాటు పూర్తిగా బయటకు రాకుండానే గడిపారు. బహిరంగ ప్రదేశాలకు ఇన్నాళ్లూ దూరంగా ఉన్న ఆయన తొలిసారి రాజ్యసభకు రానున్నారు. సభలో ఎన్డీయేకు తగిన బలం లేకపోవడంతోనే ఆయన ఓటింగ్‌లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు బీజేపీ యేతర, కాంగ్రెస్సేతర పార్టీల నుంచి తమకు మద్దతు లభిస్తుందని బీజేపీ నమ్మకంతో ఉంది. ఒడిశా ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ తమ ఓటు ఎన్డీయేకేనని ఇప్పటికే ప్రకటించారు. అయినప్పటికీ ఎన్డీయే అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టుదలగా ఉన్న బీజేపీ జైట్లీని రంగంలోకి దింపక తప్పడం లేదు. 

More Telugu News