karunanidhi: మెరీనా బీచ్ వద్ద రంగంలోకి కేంద్ర బలగాలు.. రాజాజీ హాల్ వద్ద తొక్కిసలాటలో ఇద్దరి మృతి!

  • జనసంద్రంగా మారిన రాజాజీ హాల్ ప్రాంతం
  • బ్యారికేడ్లను ధ్వంసం చేసి లోపలకు వెళ్లేందుకు యత్నిస్తున్న అభిమానులు
  • ఓ మహిళ ఆత్మహత్యా యత్నం

దివంగత కరుణానిధి అంత్యక్రియలు చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఈ సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లను అధికారులు ఆగమేఘాల మీద చేపడుతున్నారు. మరోవైపు, డీఎంకే అభిమానులు భారీ ఎత్తున బీచ్ వద్దకు చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో జనాలు అక్కడకు చేరుకుంటుండటంతో భద్రతను కట్టు దిట్టం చేస్తున్నారు. మెరీనా బీచ్ వద్ద కేంద్ర భద్రతా బలగాలు కూడా రంగంలోకి దిగాయి. భద్రతా బలగాల వాహనాలు క్రమంగా అక్కడకు చేరుకుంటున్నాయి.

మరోవైపు, కరుణానిధి పార్థివదేహాన్ని ఉంచిన రాజాజీ హాల్ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఆయనను తుదిసారి దర్శించుకునేందుకు భారీ ఎత్తున వీఐపీలు, డీఎంకే, కరుణానిధి అభిమానులు వస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఇద్దరు మరణించగా, 33 మంది గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. బ్యారికేడ్లను ధ్వంసం చేసి లోపలకు వెళ్లేందుకు అభిమానులు యత్నిస్తున్నారు. రద్దీని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కావడం లేదు. దీంతో అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. కరుణ మరణాన్ని తట్టుకోలేకపోయిన ఓ మహిళ ఆత్మహత్యా యత్నం చేసింది. 

More Telugu News