India: గత మూడేళ్లలో మన బ్యాంకుల్లో మోసాల విలువ రూ. 70 వేల కోట్లు!

  • 2017-18లో రూ. 36,694 కోట్ల నష్టం
  • రూ. 1000 కోట్లకన్నా అధికంగా బకాయిపడిన 139 మంది
  • రాజ్యసభకు వెల్లడించిన శివ్ ప్రతాప్ శుక్లా

గడచిన మూడు సంవత్సరాల వ్యవధిలో మోసాల కారణంగా ఇండియన్ బ్యాంకులు రూ. 70 వేల కోట్లను నష్టపోయాయి. ఈ విషయాన్ని ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రకాప్ శుక్లా రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, 2015-16లో రూ. 16,409 కోట్లు, 2016-17లో రూ. 16,652 కోట్లు, 2017-18లో రూ. 36,694 కోట్లను బ్యాంకులు నష్టపోయినట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్టు శుక్లా తెలిపారు.

2007-08 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి వాణిజ్య బ్యాంకుల్లో రూ. 25.03 లక్షల కోట్లుగా ఉన్న స్థూల అడ్వాన్సులు, 2014 నాటికి రూ. 68.75 లక్షల కోట్లకు పెరిగాయని ఈ సందర్భంగా శుక్లా తెలిపారు. బ్యాంకులను రూ. 1000 కోట్లకు పైగా ముంచిన వారి సంఖ్య 139 అని తెలిపారు. వీరందరి బకాయిలూ ప్రస్తుతం నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలో ఉన్నాయని వెల్లడించారు.

More Telugu News