karunanidhi: మెరీనా బీచ్ లోనే కరుణ అంత్యక్రియలు.. ప్రభుత్వ న్యాయవాదికి సెటైర్ వేసిన జస్టిస్ సుందర్

  • మెరీనా బీచ్ లో అంత్యక్రియలకు తొలగిన అడ్డంకులు
  • ప్రభుత్వ వాదనలను తోసిపుచ్చిన హైకోర్ట్
  • మెరీనా-అన్నా స్క్వేర్ లో కరుణ అంత్యక్రియలు

దివంగత కరుణానిధి అంత్యక్రియలను మెరీనా బీచ్ లో నిర్వహించేందుకు మద్రాసు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. మెరీనాలో స్మారకాల నిర్మాణం చేపట్టవచ్చని చెన్నై కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిందని డీఎంకే న్యాయవాది కోర్టుకు తెలిపారు. నిబంధనలను సాకుగా చూపి, మెరీనాలో స్థలాలను కేటాయించడం కుదరదని ప్రభుత్వ తరపు లాయర్ చెప్పారు. రాత్రికి రాత్రే మేనేజ్ చేసి, ఐదు కేసులను విత్ డ్రా చేయించారంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మేనేజ్ చేశారనే వాదన సరికాదని, తాము ఎవరినీ మేనేజ్ చేయలేదని, పిటిషన్ దారులు వారికివారే తమ కేసులను ఉపసంహరించుకున్నారని డీఎంకే తరపు న్యాయవాది వాదించారు.

ఓ రిట్ పిటిషన్ పై అత్యవసరంగా వాదనలు వినాల్సిన అవసరం లేదని ప్రభుత్వ న్యాయవాది అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ సుందర్ అసహనం వ్యక్తం చేశారు. ఓ వారం పాటు విచారణ వాయిదా వేద్దామా? అంటూ వెటకారంగా అన్నారు. చివరకు మెరీనా బీచ్ లో కరుణ అంత్యక్రియలు నిర్వహించవచ్చు అంటూ హైకోర్టు తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పు పట్ల కరుణ కుటుంబీకులు భావోద్వేగానికి గురయ్యారు. డీఎంకే శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో, మెరీనా-అన్నా స్క్వేర్ వద్ద ఈ సాయంత్రం కరుణ అంత్యక్రియలు జరగనున్నాయి. 

More Telugu News