nithin: పట్టాలెక్కబోతున్న నితిన్ కొత్త సినిమా!

  • వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్
  • ఈ నెల చివర్లో షూటింగ్ మొదలు
  • లవ్ స్టోరీ తో కూడిన ఎంటర్ టైనర్ గా ‘భీష్మ’

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా ‘భీష్మ’ పేరిట ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. మిగతా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకుని, ఈ నెలాఖరులో షూటింగ్ మొదలుపెట్టాలని చిత్ర బృందం భావిస్తోంది. లవ్ స్టోరీతో కూడిన ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో నితిన్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తోంది. కాగా, నితిన్ ప్రస్తుతం 'శ్రీనివాస కళ్యాణం' సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు.

More Telugu News