geetha govindam: విజయ్ దేవరకొండ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్?

  • 15వ తేదీన విడుదల కానున్న 'గీత గోవిందం'
  • వైజాగ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే యోచనలో టీమ్
  • చీఫ్ గెస్ట్ గా విచ్చేయనున్న చిరంజీవి

విజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' ఈ నెల 15న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న వైజాగ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించే యోచనలో టీమ్ ఉంది. మరోవైపు, ఈ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తమ ఫంక్షన్ కు మెగాస్టార్ వస్తున్నారనే విషయం తెలియగానే విజయ్ దేవరకొండ చాలా ఎగ్జైట్ అయ్యాడట. ఇటీవల జరిగిన ఈ సినిమా ఆడియో విడుదలకు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక నటించగా... పరశురామ్ దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ చిత్రం రూపుదిద్దుకుంది.


More Telugu News