kcr: కేసీఆర్ కు ఫోన్ చేసి, మద్దతు కోరిన నితీష్ కుమార్!

  • రాజ్యసభ ఉపాధ్యక్షుడి ఎన్నికల బరిలో జేడీయూ
  • మిత్రపక్షానికి అవకాశం ఇచ్చిన బీజేపీ
  • కేసీఆర్ మద్దతు కోరిన నితీష్ కుమార్

ఈ నెల 9న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో, మద్దతు కూడగట్టుకునే పనిలో పార్టీ అధినేతలు నిమగ్నమయ్యారు. అయితే రాజ్యసభలో ఏ పార్టీకి, ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ లేదు. ప్రధాన పక్షమైన బీజేపీ ఈ పదవిని తమ మిత్రపక్షమైన జేడీయూకి ఇవ్వాలని భావిస్తోంది.

ఈ నేపథ్యంలో, తమ రాజ్యసభ సభ్యుడు హరివంశ్ నారాయణ్ సింగ్ ను జేడీయూ అధినేత నితీష్ కుమార్ బరిలోకి దింపుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నితీష్ కుమార్ ఫోన్ చేశారు. తమ అభ్యర్థికి మద్దతివ్వాలని కోరారు. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా నితీష్ కు కేసీఆర్ చెప్పారు. ఈరోజు సాయంత్రంలోగా కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా కురియన్ పదవీకాలం ముగియడంతో... జూలై 1 నుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. కాంగ్రెస్, టీఎంసీలు కూడా ఈ పదవిని కోరుకుంటున్నాయి.

More Telugu News