ntr: 'అరవింద సమేత'లో ఛాన్స్ కొట్టేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్!

  • అతిధి పాత్రలో బిగ్‌బాస్1 కంటెస్టెంట్ ఆదర్శ్
  • తన కల నిజమైందని ట్వీట్ 
  • షూటింగ్ దశలో అరవింద సమేత

జూ.ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో బిగ్‌బాస్1 కంటెస్టెంట్ ఆదర్శ్ బాలకృష్ణ అతిధి పాత్రలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా సెట్స్‌లో త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలిసి దిగిన ఫొటోను ఆదర్శ్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

'అతిధి పాత్రలో నటిస్తున్నప్పటికీ.. ఎన్టీఆర్, త్రివిక్రమ్ లతో కలిసి పనిచేయాలన్న తన కల నిజమైందని తన ట్వీట్లో పేర్కొన్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. కాగా, థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, ఈశా రెబ్బా హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More Telugu News