switzerland: స్విట్జర్లాండ్ లో కుప్పకూలిన విమానం.. 22 మంది దుర్మరణం

  • కాంటన్ ఆఫ్ గ్రాబుయెన్ డెన్ ప్రాంతంలో ఘటన
  • నిన్న కూడా ఇదే ప్రాంతంలో కుప్పకూలిన మరో విమానం
  • అటువైపు వెళ్లే విమాన సర్వీసుల రద్దు

స్విట్జర్లాండ్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానంలోని 19 మంది ప్రయాణికులతో సహా, ముగ్గురు పైలట్లు దుర్మరణం చెందారు. కాంటన్ ఆఫ్ గ్రాబుయెన్ డెన్ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించిందని స్థానిక ఎయిర్ లైన్స్ సంస్థ జేయూ ఎయిర్ తెలిపింది. పిజ్ సిగ్నాస్ పర్వత ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. సముద్ర మట్టానికి 8వేల అడుగుల ఎత్తులో ఈ ప్రాంతం ఉండటంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందిన వెంటనే ఐదు హెలికాప్టర్లు, రక్షక దళాలు ప్రమాద స్థలికి చేరుకున్నాయి.

మరోవైపు ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే నిన్న కూడా ఓ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండు ప్రమాదాలు సంభవించడంతో... అటువైపు వెళ్లే విమాన సర్వీసులను రద్దు చేశారు.

More Telugu News