Salman Khan: నా సోదరుల కెరీర్ దెబ్బతినడానికి నేనే కారణం!: సల్మాన్ ఖాన్

  • నా స్టార్ డమ్ తో నా సోదరుల స్టార్ డమ్ ను పోల్చేవారు
  • నాతో సమానంగా వారి సినిమాలు ఆడవనే నిర్ణయానికి దర్శకనిర్మాతలు వచ్చారు
  • వారికి అవకాశాలు ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదు

తన సోదరులు అర్భాజ్ ఖాన్, సొహైల్ ఖాన్ ల సినీ కెరీర్ నాశనం కావడానికి తానే కారణమని సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఓ చాట్ షోలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అర్భాజ్ తన తొలి రెండు సినిమాలకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. దీంతో, ఆయన సూపర్ స్టార్ అవుతాడని అందరూ భావించారు. ఆ తర్వాత అతని సినిమాలు సక్సెస్ ను అందుకోలేకపోవడంతో... పరిస్థితి తారుమారైంది. మరోవైపు సల్మాన్ ఖాన్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

దీనిపై సల్మాన్ మాట్లాడుతూ, తన స్టార్ డమ్ తో అర్భాజ్, సొహైల్ ల స్టార్ డమ్ ను దర్శకనిర్మాతలు పోల్చేవారని చెప్పాడు. తన సినిమాలతో సమానంగా తన సోదరుల సినిమాలు ఆడవనే నిర్ణయానికి వచ్చిన దర్శకనిర్మాతలు... వారికి అవకాశాలను ఇచ్చేందుకు ఇష్టపడేవారు కాదని చెప్పాడు. ఈ రకంగా వారి కెరీర్ దెబ్బతినడానికి తానే కారణమని తెలిపాడు.

మరోవైపు హీరోగా విఫలమైన అర్భాజ్ దర్శకుడుగా, నిర్మాతగా మాత్రం రాణించాడు. ఆయన నిర్మించిన 'దబాంగ్', దాని సీక్వెల్ లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో సల్మానే హీరోగా నటించాడు.  

More Telugu News