'ఎవరీ ట్వీట్ చేసింది?' తన మేనేజర్ ను గద్దించిన సమంత!

05-08-2018 Sun 08:42
  • తనను పిలవకుండా మేనేజర్ మహేంద్ర పార్టీ
  • అడవి శేషు, రాహుల్ కోసం వెయిట్ చేస్తున్నానన్న మహేంద్ర
  • ట్వీట్ ఎవరు చేశారో చెప్పాలన్న సమంత  
టాలీవుడ్ బ్యూటీ సమంతకు కోపమొచ్చినట్టుంది. తనను పిలవకుండా, తనకు చెప్పకుండా తన మేనేజర్ మహేంద్ర, దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్, వెన్నెల కిషోర్ లు హ్యాపీగా పార్టీ చేసుకోవడంపై చిలిపిగా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇటీవల విడుదలైన 'చిలసౌ', 'గూఢచారి' చిత్రాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ రెండు సినిమాల్లో నటించిన వెన్నెల కిశోర్, మహేంద్ర, రాహుల్ లు పార్టీ చేసుకుంటూ ఎంజాయ్ చేశారు.

అందుకు సంబంధించిన ఫొటోలను మహేంద్ర తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. ఈ చిత్రాల సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని, అడవి శేషు, రాహుల్ రవీంద్రన్ కోసం వెయిట్ చేస్తున్నానని మహేంద్ర ట్వీట్ చేయగా, సమంత వాటిని చూసింది. "ఈ ట్వీట్‌ ను ఎవరు టైప్‌ చేశారు.. ముందు అది చెప్పు" అని సమంత వెంటనే స్పందించింది. ఈ పార్టీకి తనను ఎందుకు పిలవలేదన్న చిరుకోపాన్ని సమంత ఈ ట్వీట్ ద్వారా చూపగా, ఇదిప్పుడు వైరల్ అవుతోంది.